- టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : యూట్యూబర్ ప్రశ్న రావణ్‌కు వైసిపి బహిరంగంగా మద్దతు తెలపడం దారుణమని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 'ప్రశ్న రావణ్' మాటలు, అతని ప్రవర్తనను గత కొద్ది రోజులుగా దేశంలోని ప్రజలు చూశారని తెలిపారు. హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసిన అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కోట్ల మంది హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని చెప్పారు.దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ, ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్ని దేశద్రోహానికి రావణ్ పాల్పడ్డారని, అతనికి మాజీముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మద్దతు ఇవ్వడం ఏ రకమైన రాజకీయం? అని ప్రశ్నించారు.పాకిస్తాన్‌లో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులను తయారు చేసినట్లు, వైసిపి కూడా చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆదేశాలతో మాజీ ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రావణ్ తరపున వాదించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)