ప్రజాశక్తి-చంద్రగిరి : తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం రంగంపేట దగ్గర నాగపట్ల ప్రాంతం, రాగిమానుగుంటలో ఏనుగుల గుంపు బుధవారం రాత్రి బీభత్సం సృష్టించాయి. అర్ధరాత్రి గోపాలరెడ్డి మామిడి తోటలోకి వచ్చిన ఏనుగుల గుంపు పంట పొలాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేసాయి. ఏనుగుల గుంపు గ్రామ పరిసరాల్లోకి చొరబడి, అర్ధరాత్రి ఏనుగులు పంట పొలాల్లో భీకర శబ్దాలతో గీంకరిస్తుండగా, గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రైతుల మామిడి తోట, ఫెన్సింగ్ కూసాలు, నీటి పైపులను ఏనుగులు పూర్తిగా ధ్వంసం చేసాయి. మూడు రోజులుగా నాగపట్లలోనే గజరాజులు చేరినట్లు రైతులు అనుమానిస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు గ్రామస్తులు తెలియజేశారు. అటవీశాఖ అధికారులు ఏనుగుల అటవీప్రాంతంలోకి తరిమేందుకు, బాణా సంచా పేలుస్తూ, డప్పు శబ్దాలతో ప్రయత్నించారు. పంట నష్టం తప్ప ఎటువంటి ప్రమాదం జరగలేదు. గ్రామస్తులు రాత్రిపూట బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు తెలియజేసారు.
అర్ధరాత్రి ఏనుగుల గుంపు భీభత్సం
21 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 21, 2026, 10:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)