శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

War: నీళ్లూ ఆయుధమే!

1 గంట క్రితం

water war
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 12:13 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఇజ్రాయిల్‌ ‌నియంత్రణలో పాలస్తీనా జల వనరులు

- నీటి సరఫరా బంద్‌ , ఆపై కలుషితం

- దాహార్తితో నిర్మూలించడమే లక్ష్యం

- ఐరాస నివేదికలో విస్తుపోయే దారుణాలు

గాజా : పాలస్తీనియన్ల భౌతిక నిర్మూలనే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ ‌మారణహోమం జరిపింది. అత్యాధునిక మారణాయుధాలతోపాటు నీటిని కూడా ఆయుధంగా ఎక్కుపెట్టింది. విద్యుత్, ఆయిల్ మాత్రమే కాకుండా ప్రాణావసరమైన నీటిని కూడా పాలస్తీనా ప్రజలకు దూరం చేసి దాహార్తితో మృతి చెందేవిదంగా ఇజ్రాయిల్ దారుణాలకు పాల్పడిందని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలను పరిశీలిస్తే.. పాలస్తీనాలోని రెండు ప్రధాన భూగర్భ జలవనరుల నుండి వచ్చే నీటిని ఇజ్రాయిల్‌కు చెందిన మెకోరోట్ సంస్థ స్వాధీనం చేసుకుంది. నీళ్లు కావాలంటే అధిక మెత్తంలో చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. దీంతో పాలస్తీనయన్తు దాహార్తితో అల్లాడిపోయారని నివేదిక స్పష్టం చేసింది. అయితే, నీటిని వ్యాపార సరుకుగా మార్చడం, భూగర్భ జలవనరులను కలుషితం చేయడం ద్వారా రెండు రకాలుగా నీటి ఆయుధాన్ని ప్రయోగించి, క్రూరంగా, అమానవీయంగా ఇజ్రాయిల్ వ్యవహరిస్తుదని కమిషన్ తెలిపింది.

స్థావరాల విస్తరణ..

పాలస్తీనాలో తమ స్థావరాలను విస్తరించుకోవడానికి, స్థానిక ప్రజలనుండి ప్రతిఘటనలు రాకుండా నివారించుకోవడానికి ఇజ్రాయిల్ చాలా కాలంగా నీటిని ఆయుధంగా మార్చుకుంది. జోర్డాన్ నదిని ఆక్రమించుకున్న తర్వాత, వెన్ట్ బ్యాంకులోని పశ్చిమ, ఈశాన్య, తూర్పు బేసిన్ అనే మూడు ప్రధాన బేసిన్‌ల జలవనరులపై ఇజ్రాయిల్ పూర్తి నియంత్రణ సాధించింది. 1993, 1995 లో జరిగిన ఓస్లో రెండు ఒప్పందాలు పాలస్తీనా నీటి వనరులను ఇజ్రాయిల్ కబ్జా చేయడానికి కారణమయ్యాయి. పాలస్తీనా ప్రాంతాలను మూడు విభాగాలుగా (ఎ,బి,సి) విభజంచారు. సి విభాగం కింద ఇజ్రాయిల్ ఆక్రమితి భూభాగం వుంది. నీటి వనరుల్లో అత్యధికభాగం ఇక్కడకు అందేలా ఈ ఒప్పందం జరిగింది. అలాగే పాలస్తీనాలోని మూడు ప్రధాన భూగర్భ జలవనరులలో వున్న నీటి వనరులలో 80 శాతం ఇజ్రాయిల్ వినియోగించుకునేలా బప్పందం జరిగింది. ప్రతి వ్యక్తి కనీసం రోజుకు 100 లీటర్ల నీటిని పొందాలని అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి గతంలో ఒక సిఫార్సు చేసింది. పాలస్తీనా ప్రజలు 65 నుండి 70 లీటర్ల లోపు మాత్రమే నీటిని పొందారు. ఈ దారుణాలన్నీ హమాస్ ఉగ్రదాడికి ముందే అంటే 2023 అక్టోబర్ 7కు ముందే జరిగడం గమనార్హం.

నీటి వనరులు స్వాధీనం...

హమాస్ దాడిని అవకాశంగా తీసుకుని మరింత విస్తృంగా తాగు, సాగునీటి సరఫరాలను నిలిపివేసింది. 2023 అక్టోబరు 9న ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ‘సంపూర్ణ ముట్టడి’కి ఆదేశించడంతో పాలస్తీనా ప్రజలకు చెందాల్సిన నీరు, విద్యుత్, అయిల్ సరఫరాను పూర్తిస్థాయిలో ఇజ్రాయిల్ సైన్యం తమ స్వాదీనంలోకి తీసుకుంది. తమ భూముల్లో వ్యవసాయం లేదా తాగునీటి అవసరాలకోసం బోర్లు, తవ్వకాలు చేయడానికి ఇజ్రాయిల్ సైన్యం లేదా ఇజ్రాయిల్ వాటర్ ప్రాజెక్టు అథారిటీ నుండి అనుమతులు పొందాలి, ఈ అనుమతులు అత్యంత కఠినతరం చేసింది. తద్వార నీరు అందుకుండా అడ్డుకుంటుంది. ఇజ్రాయిల్ ఆక్రమించుకున్న భూభాగంలో అత్యంత లోతుల్లోకి బోర్లువేసి నీటిని తోడేస్తున్నారని, దీనివల్ల పాలస్తీనాలో 93 శాతం భూమికి నీటిపారుదల సౌకర్యాలు లేకపోవడంతో ఇజ్రాయిల్ వ్యవసాయ ఉత్పత్తులతో వీరు పోటీ పడలేక దివాళతీసారని, నీరు ఆయుధంగా మారడం చరిత్రలో అతిపెద్ద విషాదంగా కమిషన్ అభిప్రాయ పడింది.

విలువైన ఖనిజాలను దోచుకున్న ఇజ్రాయిల్‌

పాలస్తీనా భూముల్లో శాశ్వత ఇళ్ల నిర్మాణం కోసం 2024లో ఇజ్రాయిల్ ప్రభుత్వం గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ తన బడ్జెట్‌ను రెట్టింపు చేసి, 200 మిలియన్ డాలర్లను ఇందుకోసం కేటాయించిదని కమిషన్ నిర్ధారించింది. ఇక్కడ జరిగే నిర్మాణల కోసం క్యాటర్‌పిల్లర్, హెచ్‌డి హ్యుందాయ్, వోల్వో లాంటి కార్పొరేట్ కంపెనీల ఎక్స్‌లేటర్లు, భారీ యంత్రాలు పనిచేస్తున్నాయి. జర్మన్‌కు చెందిన హైడెల్‌బర్గ్ దాని అనుబంధ యూనిట్ హాన్సన్ పాలస్తీనాలోని నహల్ రాబా క్వారీ నుండి లక్షల టన్నుల డోలమైట్ రాయిని దోచుకున్నట్లు ఐరాస కమిషన్ తెలిపింది. ఇజ్రాయిల్ ప్రభుత్వం వ్యాపారం సాగిస్తుంది. మార్చి 2024 నుండి గ్లోబల్ రియల్ ఎస్టేట్ గ్రూప్, కెల్లర్ విలియమ్స్ రియల్టీ LL దాని ఇజ్రాయిల్‌ ఫ్రాంచైజీ ఖఔ, కెల్లర్ విలియమ్స్, మరొక ఫ్రాంచైజీ అయిన హోమ్ ఇన్ ఇజ్రాయెలీ కంపెనీలు పెద్దఎత్తున పాలస్తీనా భూభాగంలో నిర్మాణాలు చేపట్టాయి. ఈ రకంగా వ్యవసాయ భూములు మాత్రమే కాదు, పచ్చికబీళ్ళను కూడా ఈ కంపెనీలను ఆక్రమించుకున్నాయి. దీంతో పాలస్తీనా పాడిపరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిందని కమిషన్ ప్రకటించింది. స్వయం సమృద్ధిగా వున్న పాలస్తీనా పాడిపరిశ్రమ 2023 తర్వాత ఇజ్రాయిల్ పాడిఉత్పత్తులపై ఆధారపడటం 160 శాతం పెరిగిందని కమిషన్ వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్