శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాణించిన ఇషాన్‌, అభిషేక్‌

1 గంట క్రితం

team india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 01:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టి20లో భారత బ్యాటర్లు రాణించారు. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టి20లో టాస్ గెలిచికు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (43) పవర్‌ప్లేలో బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (49), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (37) కీలక భాగస్వామ్యం నెలకొల్పి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇషాన్ కిషన్ ఒక్క పరుగు తేడాతో అర్ధశతకాన్ని చేజార్చుకున్నాడు. ఇక శివమ్ దూబే (5) విఫలమైనప్పటికీ, చివర్లో తిలక్ వర్మ (24 నాటౌట్) రెండు సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో భారతజట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, లియామ్ డాసన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. సూర్యవంశీ స్కోరులో రెండు భారీ సిక్సులున్నాయి. వాటిలో ఆర్చర్ బౌలింగ్ లో లెగ్ సైడ్ కొట్టిన సిక్సర్ ఇన్నింగ్స్ కే హైలైట్ గా నిలిచింది. అయితే, పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడబోయిన సూర్యవంశీ స్టంపౌట్ అయ్యాడు.

స్కోర్‌‌బోర్డు...

ఇండియా ఇన్నింగ్స్‌: అభిషేక్‌ ‌శర్మ (సి)టామ్‌ ‌బాంటమ్‌ (‌బి)కర్రన్‌ 43, వైభవ్‌ ‌సూర్యవంశీ (స్టంప్‌)‌బట్లర్‌ (‌బి)విల్‌ ‌జాక్స్‌ 14, ఇషాన్‌ ‌కిషన్‌ (‌సి)డాసన్‌ (‌బి)కర్రన్‌ 48, శ్రేయస్‌ అయ్యర్‌ (‌సి)బాంటన్‌ (‌బి)డాసన్‌ 37, దూబే (సి)బాంటన్‌ (‌బి)కర్రన్‌ 5, తిలక్‌ ‌వర్మ (నాటౌట్‌) 24, అక్షర్‌ ‌పటేల్‌ (‌రనౌట్‌)‌బట్లర్‌ 2, హర్షిత్‌ ‌రాణా (సి)బట్లర్‌ (‌బి)ఆర్చర్‌ 6, అదనం 10 (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 190 పరుగులు.

వికెట్ల పతనం: 1/50, 2/65, 3/130, 4/146, 5/165, 6/165, 7/190

బౌలింగ్‌: ఆర్చర్‌ 4-0-40-1, టంగ్‌ 4-0-46-0, విల్‌ ‌జాక్స్‌ 3-0-22-1, కర్రన్‌ 4-0-33-3, డాసన్‌ 3-0-27-1, రషీద్‌ 2-0-21-0.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్