- షూటౌట్‌లో ఆస్ట్రేలియాపై సంచలన విజయం
- నాకౌట్‌లో గెలుపుతో ప్రి క్వార్టర్స్‌కు.. ముగిసిన రౌండ్-32 పోటీలు
కొలంబియా-ఘనా జట్ల మధ్య శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌తో ఫిఫా ప్రపంచకప్-2026 రౌండ్-32 మ్యాచ్‌లు ముగిసాయి. టైటిల్ ఫేవరేట్ జట్లు జర్మనీ, నెదర్లాండ్స్ ఈసారి ప్రీ క్వార్టర్స్‌కు చేరడంలో విఫలమయ్యాయి. ఆసియా ఖండ జట్లు జపాన్, ఆస్ట్రియా, ఆస్ట్రేలియాతోపాటు ఆఫ్రికా ఖండ జట్లు ఈజిప్ట్, కొలంబియా మినహా మిగతా జట్లన్నీ చాపచుట్టేశాయి. ఆదివారం నుంచి రౌండ్-16(ప్రీ క్వార్టర్ ఫైనల్) మ్యాచ్‌లు జరగనున్నాయి.
డల్లాస్: డల్లాస్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఈజిప్ట్ జట్టు ఆస్ర్టేలియాపై సంచలన విజయం సాధించి తొలిసారి ప్రీ క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. రౌండ్-32లో భాగంగా ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన కీలక పోరులో ఈజిప్ట్ పెనాల్టీ షూటౌట్‌లో 4-2తో విజయం సాధించింది. నిర్ణీత, అదనపు సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్ లో ఈజిప్ట్ 4 గోల్స్ చేయగా.. ఆస్ట్రేలియా 2 గోల్స్ మాత్రమే చేసింది. ఈజిప్ట్ తరఫున ఇమామ్ అశోర్ (13వ నిమిషం) గోల్ కొట్టగా.. 55వ నిమిషంలో మొహమ్మద్ హనీ సెల్ఫ్ గోల్ కొట్టాడు. అదనపు సమయంలోనూ ఇరుజట్లు మరో గోల్‌కొట్టడంలో విఫలమయ్యాయి. అయితే పెనాల్టీ షూటౌట్‌లో తొలి కిక్‌లో ఆస్ట్రేలియా తరఫున హారి సౌట్టర్ గోల్ చేయడంలో విఫలమయ్యాడు. ఈజిప్ట్ తరఫున మహ్మూద్ సాబెర్ స్కోర్ చేశాడు. ఇక రెండో కిక్‌లో ఆస్ట్రేలియా తరఫున జాక్సన్ ఇర్విన్, ఈజిప్ట్ తరఫున రామి రబియా స్కోర్ చేశారు. మూడో కిక్‌లో ఈజిప్ట్ తరఫున మహ్మద్ సాలా, ఆసీస్ తరఫున అవర్ మాబిల్ స్కోర్ చేయడంతో ఆధిక్యం 3-2కు తగ్గింది. కీలకమైన నాలుగో కిక్‌లో ఆస్ట్రేలియా మిస్ చేయగా, ఈజిప్ట్ తరఫున అబ్దెల్‌మిగుడ్ స్కోర్ చేయడంతో 4-2తో ఈజిప్ట్ జయకేతనం ఎగురవేసింది. దీంతో ఆఫ్రికా ఖండం నుంచి రౌండ్-16కు అర్హత సాధించిన రెండో దేశంగా ఈజిప్ట్ నిలిచింది. ప్రి క్వార్టర్స్‌లో ఈజిప్ట్ జట్టు అర్జెంటీనాతో తలపడనుంది.
ఘనాపై గెలుపుతో కొలంబియా కూడా...
కాన్సాస్ సిటీ వేదికగా జరిగిన మరో రౌండ్-32 మ్యాచ్‌లో కొలంబియా జట్టు ఘనాను ఓడించి ప్రి క్వార్టర్స్‌కు చేరింది. జాన్ అరియాస్ తొలి అర్ధభాగంలో చేసిన గోల్‌తో గోల్ కొలంబియా విజయం సాధించింది. జాన్ కార్డోబా గాయం కారణంగా మైదానం వీడగా.. కోచ్ నెస్టర్ లోరెంజో వెంటనే లూయిస్ సువారెజ్‌ను బరిలోకి దించారు. ఈ నిర్ణయం వెంటనే ఫలించింది. 14వ నిమిషంలో, డేనియల్ మునోజ్ ఇచ్చిన పాస్‌తో సువారెజ్ ముందుకు దూసుకెళ్లాడు. తక్కువ ఎత్తులో వచ్చిన క్రాస్‌ను అరియాస్ తలతో అందుకుని, ఘానా గోల్ కీపర్ లారెన్స్ అటి-జిగీని దాటి బంతిని గోల్‌లోకి పంపాడు. మ్యాచ్‌లో అదే ఏకైక గోల్. ఆ గోల్ తర్వాత కూడా కొలంబియా ఆధిపత్యాన్ని కొనసాగించింది. లూయిస్ డియాజ్ రెండవ గోల్ చేసినట్లు కనిపించినా, అది ఆఫ్ సైడ్ అని తేలింది. ఆ తర్వాత అటి-జిగి అద్భుతంగా బంతిని అడ్డుకున్నాడు. యారోహెడ్ స్టేడియంలో ఈ మ్యాచ్ అత్యంత వేడి వాతావరణంలో జరిగింది. ఆట ప్రారంభమయ్యే సమయానికి ఉష్ణోగ్రత 31.1 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోగా, హీట్ ఇండెక్స్ 96 డిగ్రీల ఫారెన్‌హీట్‌గా నమోదైంది. ఆటగాళ్లు తీవ్రమైన వేడితో ఇబ్బంది పడ్డారు. మ్యాచ్ అంతటా నీళ్లు తాగడానికి విరామాలు తీసుకోవడం చాలా అవసరమైంది. ఈ గెలుపుతో కొలంబియా 2026 ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో స్థానం కోసం కొలంబియాజట్టు స్విట్జర్లాండ్‌తో తలపడనుంది.







కామెంట్‌లు (0)