గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కోచింగ్‌ సెంటర్‌‌ అగ్నిప్రమాదం.. కాబోయే భార్యాభర్తలిద్దరూ మృతి..శోక సంద్రంలో ఇరు కుటుంబాలు

23 జూన్, 2026

Lucknow fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 23, 2026, 12:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : లక్నోలోని అలీఘర్‌ ‌ప్రాంతంలో గల కోచింగ్‌ ‌సెంటర్లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు కాబోయే భార్యాభర్తలుండడడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నీలేష్‌‌కుమార్‌ (27), అనామిక సమంత(30)లిద్దరూ అగ్నిప్రమాదం సంభవించిన కోచింగ్‌ ‌సెంటర్లోనే పని చేస్తున్నారు. ఇద్దరూ ఒకేచోట పనిచేయడంతో మొదట స్నేహితులయ్యారు. ఆ తర్వాత వారి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరిపెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. గతవారమే అనామిక తల్లిదండ్రులు బెంగాల్‌ ‌నుంచి లక్నోకి వచ్చి నీలేష్‌ ‌కుమార్‌ ‌కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి ఏర్పాట్లపై మాట్లాడుకున్నారు. ఇంతలోనే అగ్నిప్రమాదంలో నీలేష్‌, అనామికలు అగ్నికి ఆహుతవ్వడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కొద్దిరోజుల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్న ఈ నవవధూవరులు విగతజీవులవ్వడంతో అందరినీ కలచివేస్తోంది. అనామిక చాలా యాక్టివ్‌. అందరితో చాలా కలివిడిగా ఉంటుంది. ఇటీవలే మా ఇంట్లో జరిగిన ఓ చిన్న కార్యక్రమానికి ఆమె కూడా హాజరైంది అని నీలేష్‌ ‌సోదరుడు అభిషేక్‌ అన్నారు. నీలేష్‌ ఇప్పటికే కొంత డబ్బు దాచుకుని.. ఓ ఇల్లు కడుతున్నారు. ఆ ఇల్లు వచ్చే ఏడాది పూర్తవుతుంది. అందులోనే తాను పెళ్లి చేసుకుంటానని.. తనకు ప్రమోషన్‌ ‌కూడా వస్తుందని, జీతం పెరుగుతుందని అప్పుడు పెళ్లి చేసుకున్నా ఆర్థికంగా ఇబ్బందులుండవని తనకు చెప్పినట్లు బంధువు సమరేంద్ర చెప్పారు. ఇంతలోనే అతను చనిపోయిన వార్త తననెంతో కలచివేసిందని ఆయన అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్