బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫీజు వివరాలు ప్రదర్శించాల్సిందే

3 గంటల క్రితం

madras-high-court.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : తమిళనాడులోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ ఫీజుల వివరాలను నోటీసు బోర్డులు, వెబ్‌సైట్లలో తప్పనిసరిగా ప్రదర్శించాలని మద్రాస్‌ ‌హైకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన ఫీజు నిర్ధారణ కమిటీ ద్వారా నిర్ధారించబడిన ఫీజుల వివరాలను అన్ని ప్రైవేట్ పాఠశాలలు తమ నోటీసు బోర్డులు, వెబ్‌సైట్లలో ఎప్పటికప్పుడు ఆప్‌‌డేట్‌ ‌చేసేలా ప్రైవేట్ పాఠశాలల డైరెక్టర్ తనిఖీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.

తమిళనాడు ప్రైవేట్ పాఠశాలల (నియంత్రణ) చట్టం 2019 పరిధిలోకి వచ్చే అన్ని పాఠశాలలు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కమిటీ నిర్ధారించిన ఫీజులతో పాటు, సంబంధిత అధికార సంస్థ ఆమోదించిన ఇతర ఫీజులను కూడా ప్రదర్శించాలని హైకోర్టు పేర్కొంది. చెన్నైకి చెందిన ఆల్ ఇండియా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అసోసియేషన్ (ఎటిఎస్‌ఐసి) ప్రధాన కార్యదర్శి కె. పళనియప్పన్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. నిజానికి ఈ పిటిషన్‌ అన్ని ప్రైవేటు పాఠశాలలు తమ నోటీసు బోర్డులపై ఫీజుల వివరాలను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేస్తూ ప్రైవేట్ పాఠశాలల డైరెక్టర్ జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ దాఖలయింది. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ విద్యా సంస్థలకు సర్క్యులర్‌ వర్తించదని ఈ పిటిషన్‌ వాదించింది


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్