కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లోని బరుయిపూర్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ప్రభాస్ మోండల్ బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం అర్థరాత్రి సుమారు 12:45 గంటలకు క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం ప్రభాస్ మోండల్‌ను బరుయిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యాపూర్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. మోండల్ ఒక పోలీసు అధికారి సర్వీస్ రివాల్వర్‌ను లాక్కుని, పోలీసు బృందంపై ఒక రౌండ్ కాల్పులు జరిపి, అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడని అన్నారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ప్రభాష్ మోండల్ గాయపడ్డాడు. అతన్ని వెంటనే బరుయిపూర్ ఆసుపత్రికి తరలించగా, అతడు మరణించినట్లు వైద్యులు నిర్థారించారని అన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని బరుయిపూర్ పోలీస్ జిల్లా సూపరింటెండెంట్ పలాష్ చంద్ర దాలి తెలిపారు. ప్రభాస్ వాంగ్మూలం ఆధారంగా మరుసటి రోజే మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని దాలి పేర్కొన్నారు. కోల్‌కతాలో శనివారం 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య అనంతరం బతికుండగానే చెరువులోకి విసిరేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు బిజెపి నేత.
కోల్‌కతా బాలికపై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)