బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పాకిస్థాన్‌లో అదృశ్యమైన యుఎఇ కార్గో విమానం .. గాలింపు చర్యలు వేగవంతం

2 గంటల క్రితం

Boeing cargo plane
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌లో అదృశ్యమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఎఇ) కార్గో విమానం కోసం గాలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. యుఎఇలోని షార్జా నుండి కరాచీకి వస్తున్న బోయింగ్ 737 కార్గో విమానంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9.18 గంటలకు నావిగేషన్ సిస్టమ్‌లో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. విమానం వేగంగా కిందికి దిగుతూ, తన దిశను ఆకస్మికంగా మార్చుకున్నట్లు రాడార్ డేటా చూపించిందని, ఆ తర్వాత కరాచీకి పశ్చిమంగా సుమారు 155 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని అన్నారు. కరాచీకి చెందిన కే2 ఎయిర్‌వేస్ ఈ విమానాన్ని నడుపుతోంది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. అధికారులు రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్‌ను అప్రమత్తం చేశారని, గల్లంతైన విమానం ఆచూకీ కనుగొనేందుకు వివిధ ఏజెన్సీలు సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నట్లు పాకిస్థాన్‌ విమానాశ్రయ అథారిటీ ఎక్స్‌ పోస్ట్‌లో వెల్లడించింది. విమానం అదృశ్యానికి గల కారణాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్