తొలి దశ ఎస్ఐఆర్ తరువాత ముసాయిదా విడుదల
27 లక్షల ఓట్లు తొలగించారన్న బిజెడి
భువనేశ్వర్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో 20 లక్షల మంది ఓట్లు తొలగించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ముసాయిదా నివేదికను ఆదివారం విడుదల చేసింది. 27 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారని ప్రధాన ప్రతిపక్షం బిజెడి విమర్శించింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు 3,13,87,034 ముందు ఒడిశాలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,33,99,591గా ఉండేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ) ఆర్.ఎస్. గోపాలన్ తెలిపారు. తాజాగా విడుదలైన ముసాయిదా నివేదిక ప్రకారం, ఆ సంఖ్య ఉంది. మొత్తం ఓటర్లలో 1,60,19,176 మంది పురుషులు, 1,53,65,083 మంది మహిళలు, 2,775 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. తొలగింపుల్లో మరణించిన వారు 8.32 లక్షలు (మొత్తం ఓటర్లలో 2.49%) ఉండగా, 10.07 లక్షల మంది ఓటర్లు (3.02%) అందుబాటులో లేకపోవడం లేదా వేరే ప్రాంతానికి తరలివెళ్లడం వంటి కారణాలతో జాబితా నుండి తొలగించబడ్డారు. ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 1.58 లక్షలు (0.47%)గా ఉంది. మరణించినట్లు, శాశ్వతంగా వలస వెళ్ళినట్లు, ఆచూకీ లేనివారిగా లేదా దరఖాస్తు ఫారమ్లు అందని వారిగా గుర్తించిన ఓటర్ల బూత్ స్థాయి జాబితాలను, ధృవీకరణ కోసం రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లతో (బిఎల్ఎ) పంచుకున్నట్లు సిఇఒ కార్యాలయం తెలిపింది. సిఇఒ విడుదల చేసిన ప్రకటన ప్రకారం... ఆదివారం నాటికి, మొత్తం 3,33,99,591 మంది ఓటర్లలో 3,13,87,034 మంది (93.97%) తమ వివరాల నమోదు ఫారమ్లను సమర్పించారు. అభ్యంతరాలు ఉన్న ఓటర్లు 'ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950'లోని సెక్షన్ 24 ప్రకారం జిల్లా కలెక్టరు, ఆ తర్వాత ప్రధాన ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. అప్పీళ్లు దాఖలు చేయడంలో ఓటర్లకు సహాయపడేందుకు వాలంటీర్లకు కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఆగస్టు 4 వరకూ క్లెయిములు, అభ్యంతరాలు
ఆదివారం నుంచి ఆగస్టు 4 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించబడతాయి. నోటీసు దశ (విచారణ, ధృవీకరణ) జూలై 5, 2026 నుండి సెప్టెంబర్ 2, 2026 వరకు నిర్వహించబడుతుంది. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 6, 2026న ప్రచురించబడుతుంది.
సంఖ్యలలో పొంతన లేదు: బిజెడి విమర్శ
ఒడిశా రాష్ట్రంలో 27 లక్షల ఓట్లు తొలగించారని బిజెడి విమర్శించింది. అధికారిక వెబ్సైట్ ప్రకారం, 2025లో ప్రచురించబడిన తుది ఓటర్ల జాబితాలో రాష్ట్రంలో 3,40,72,744 మంది నమోదిత ఓటర్లు ఉన్నారని బిజెడి ఉపాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మిశ్రా పేర్కొన్నారు. మే 14న ఒడిశాలో ఎస్బీఆర్ ప్రక్రియకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత, మే 15న జరిగిన సమావేశంలో రాష్ట్రంలో సుమారు 3.34 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాజకీయ పార్టీలకు సమాచారం అందించారని మిశ్రా తెలిపారు. 'ఆ తర్వాత, జూన్ 12న ఓటర్ల సంఖ్య 3,33,99,591గా చూపబడింది. అయితే, ఆదివారం నాడు ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించినప్పుడు, ఒడిశా సిఇఒ కేవలం 3,13,87,034 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. కాబట్టి, వివిధ దశల్లో అధికారికంగా అందించిన గణాంకాల మధ్య ఎటువంటి సొంతన లేదు, అని ఆయన ఆరోపించారు. '2026 SIR ఓటర్ల జాబితాను, 2025 తుది ఓటర్ల జాబితా, 2002లో ఒడిశాలో జరిగిన గత SIR ఓటర్ల జాబితాలను సరిపోల్చడ ద్వారా రూపొందించారు. 2025 తుది ఓటర్ల జాబితాను విశ్లేషిస్తే, ముసాయిదా జాబితా నుండి 20.14 లక్షల మంది ఓటర్లను తొలగించినట్లు అధికారికంగా పేర్కొన్నప్పటికీ, వాస్తవానికి దాదాపు 27 లక్షల మంది ఓటర్లు జాబితా నుండి తొలగించబడ్డారని తేలింది."
మణిపూర్ 19.34 లక్షల మంది ఓటర్లు
ఎన్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాలో మణిపూర్ రాష్ట్రంలో 19.34 లక్షల మంది ఓటర్లు ఉన్నారని ఆ రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అరుణ్ కుమార్ సిన్హా తెలిపారు. జూన్ 28 నాటికి మొత్తం 20,93,076 మంది ఓటర్లలో 19,34,399 ລ້໖ (໑໐ 92.42%) ລ້ ລ້ సేకరణ ఫారమ్లను సమర్పించారని శ్రీ సిన్హా పేర్కొన్నారు. 7,394 మంది ఓటర్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదై ఉన్నట్లు బిఎల్బలు గుర్తించారని ఆయన తెలిపారు. 43,000 మంది ఓటర్లు మరణించారని పేర్కొన్నారు. 1,08,283 మంది ఓటర్లు తమ నివాసాలను మార్చుకున్నారని, లేదా బీఎల్ఎలు వారిని గుర్తించకపోవడం వల్ల గైర్హాజరయ్యారని తెలిపారు.







కామెంట్‌లు (0)