ప్రతి ప్రవేశద్వారం
గుర్తింపు కార్డు చూపమంటుంది
మేము జేబులు తడుముకుంటుంటే
మీరు నొసలు చిట్లిస్తుంటారు!
ఏ గుర్తింపు పత్రం ఉంటే
దేశం మాదవుతుందో తెలీదు
మేమూ ఈ దేశ పౌరులమేనని
ఏ కాయితం రుజువు చేస్తుందో తెలీదు
కావాలంటే
మా రక్తం క్యూ ఆర్ కోడ్
స్కాన్ చేసి తనిఖీ చేసుకోండి
ఈ దేశపు డీఎన్‌ఏతో
తప్పక మ్యాచ్ అవుతుంది!
నెత్తురును మించిన
ఐడీ కార్డ్
ఏముంటుంది దొరా?
మీరు ఎన్ని రకాల
కార్డుల్నైనా మార్చుకోండి
ఈ మట్టి పొరల దిగువనే
మా అసలు గుర్తింపు కార్డులున్నాయి
కావాలంటే తవ్వి చూసుకోండి
- కంచరాన భుజంగరావు
94415 89602







కామెంట్‌లు (0)