ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒకటే స్వరం

3 గంటల క్రితం

jai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒకపిట్ట మా చెట్టు కొమ్మ మీద

పది రోజులుగా

అరుస్తోంది.. రెక్కల పిడికిట్లో

రాజ్యాంగం ఉంది

గింజలకు బదులు

రబ్బరు బులెట్లు మింగింది

శరీరాన్ని మొత్తం జల్లెడ చేసిన

కర్ర మేకుల్ని వంచింది

నీటి తుపానుల్లో నిలబడి

ఎండని, వానని

ఆకలిని సైతం లెక్కచేయకుండా

నిరసించింది..

చెట్టుని నరకాలనే గొడ్డలి

భయంతో తిరిగి పారిపోయింది

ఇప్పుడు పక్షులన్నీ ఒకటే పాట

ఆకాశమంతా ఒకటే స్వరం

జైభీం.. జైజైభీం..

రాజ్యాంగం వర్ధిల్లాలి

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి

నేలపూరి రత్నాజీ

8919998753

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్