సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నువ్వలాగే ఉండు

-278 నిమిషాల క్రితం

cartoon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 10:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముక్కాల పీట మీద ఏనుగు నుంచున్నట్టు

కొంచెం కొంచెం సేద తీరుతూ

నువ్వలాగే ఉండు

ఎందుకు గుండె దడ?

గిట్టల చప్పుడుతో గుర్రం గాలిలో ఎగురుతున్నట్టు

కొంచెం కొంచెం దేహం వణుకుతూ

నువ్వలాగే ఉండు

ఎందుకు మానసిక ఒత్తిడి?

నదీ ప్రవాహాన్ని

పాదాలడ్డుపెట్టి నిలువరించినట్టు

కొంచెం కొంచెం రెప్పల్ని టపటపలాడిస్తూ

నువ్వలాగే ఉండు

ఎందుకు కన్నీళ్లు?

గతుకుల గంతల రోడ్డును మైనంతో పూసినట్టు

కొంచెం కొంచెం గంభీరతను ప్రదర్శిస్తూ

నువ్వలాగే ఉండు

ఎందుకు దుఃఖం?

మండుతున్న పర్వతం లావా మీద పడినట్టు

కొంచెం కొంచెం చేతులు కట్టుకుంటూ

నువ్వలాగే ఉండు

ఎందుకు భయం?

నాలో నేను యుద్ధం చేసుకుంటూ

అచ్చం నేనలాగే ఉంటాను.


​- దాట్ల దేవదానం రాజు

94401 05987

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్