ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : పుంగనూరు జాతీయ రహదారిపై గంగినాయనపల్లి సచివాలయం సమీపంలో సోమవారం కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు ... రామకుప్పం మండలం బగల్నతం గ్రామానికి చెందిన హరిబాబు 27సం భువనేశ్వరి 24సం, స్వప్న17సం. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురూ రోడ్డుపై పడిపోగా, స్థానికులు వెంటనే ఆటోలో బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యాధికారి డాక్టర్ విజయచంద్ర క్షతగాత్రులను పరీక్షించారు. హరిబాబుకు తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు ముక్కు, నోటి నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించారు. భువనేశ్వరికి ఛాతిపై బలమైన దెబ్బ తగిలి, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్వప్నకు కుడి కాలికి గాయం, శరీరంపై స్వల్ప గాయాలైనట్లు నిర్ధారించారు. హరిబాబు, భువనేశ్వరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ ద్వారా కుప్పంలోని పి.ఈ.ఎస్. ఆసుపత్రికి తరలించినట్లు డాక్టర్ విజయచంద్ర తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కారు–ద్విచక్ర వాహనం ఢీ - ఇద్దరి పరిస్థితి విషమం
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 05:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)