మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బదిరుల పాఠశాల విద్యార్థినులకు షైనింగ్ స్టార్స్ అవార్డు

15 గంటల క్రితం

'Shining Stars' Award for Students of School for the Deaf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల) : జిల్లా కేంద్రమైన బాపట్లలో విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నాగులపాలెం బదిరుల పాఠశాలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన ఎస్.కె నగీనా, ఎం దర్శిని ఇద్దరు విద్యార్థినిలు షైనింగ్ స్టార్ అవార్డులను జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇద్దరు విద్యార్థులకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రం రూ 20వేలు చొప్పున నగదు బహుమతులను ప్రధానం చేసినట్లు పాఠశాల హెచ్ఎం ఉమాదేవి తెలిపారు.రాష్ట్రంలోని మూడు సి డబ్ల్యూ ఎస్ ఎన్ పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ఇన్చార్జి మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ ఆయా పాఠశాలల విద్యార్థులను అభినందించారు. తమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థినిలకు అవార్డు రావడం పట్ల పాఠశాల ఫౌండర్ డాక్టర్ నాగుబడి సుబ్బారావు, కరస్పాండెంట్ రామకృష్ణ, మేనేజర్ ఆంజనేయులు ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, గౌరవ ప్రతినిధి నాగుబడి సుబ్బారావు పాఠశాల సిబ్బంది విద్యార్థిని లను అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్