న్యూఢిల్లీ : దేశంలోనే తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కి ఆమోదం లభించింది. టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా అభివృద్ధి చేసిన QDENGA (TAK-003) వ్యాక్కిన్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతించింది. 4 నుంచి 60 ఏళ్ల వయస్సు గల వారికి డెంగ్యూ నివారణ కోసం ఈ టీకాను రెండు డోసులుగా, మూడు నెలల వ్యవధిలో ఇవ్వనున్నారు. గతంలో డెంగ్యూ సోకినా, సోకకపోయినా ఈ టీకా తీసుకోవచ్చని, టీకాకు ముందు ప్రత్యేక స్క్రీనింగ్ అవసరం లేదని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా ఈ అనుమతి లభించిందని, డెంగ్యూ నివారణతో పాటు ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించడంలో ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేసిందని టకేడా వెల్లడించింది. ఇప్పటికే 43 దేశాల్లో ఈ వ్యాక్సిన్‌కు అనుమతి లభించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా అధిక డెంగ్యూ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో దీని వినియోగాన్ని సిఫార్సు చేసింది. ఇది ప్రస్తుతం బ్రెజిల్ జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఉందని, అర్జెంటీనా, కొలంబియా, ఇండోనేషియాలోని ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందుబాటులో ఉందని తెలిపింది.
దేశంలోనే తొలి డెంగ్యూ వ్యాక్సిన్‌కి డిసిజిఐ ఆమోదం
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 05:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)