మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇంటర్ స్టేట్ ర్యాంకర్ తాహిరా ఫాతిమాకు షైనింగ్ స్టార్ అవార్డు

15 గంటల క్రితం

'Shining Star' Award for Inter-State Ranker Tahira Fathima
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 05:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జిల్లా కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా అందుకున్న విద్యార్థిని..


ప్రకాశం : ఈ ఏడాది ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో 1000/993 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్థానిక శ్రీ వివేకానంద కళాశాల విద్యార్థిని, విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ మహమ్మద్ మోహిద్దీన్ జిలాని - ఖాదరున్నీషా బేగంలా కుమార్తె తాహిరా ఫాతిమా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సైనింగ్ స్టార్ అవార్డును సోమవారం అందుకున్నారు. జిల్లా కేంద్రం మార్కాపూర్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుతోపాటు 20 వేల రూపాయల చెక్కును అందుకున్న ఫాతిమాను పలువురు అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువు చదివి మంచి విజ్ఞానంతో సమాజ సేవ చేయడంతోపాటు తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలను నిలబెట్టాలని కలెక్టర్ విజయ సునీత విద్యార్థినికి సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్