బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకూలిపోయింది...

5 గంటల క్రితం

Hostel.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 04:03 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విద్యలమ్మ కూలిపోయింది

ఆశల జీవితాలు శిథిలాల కింద

వినోద, విషాదాల చిరిగిన భవనం

చిది'మేసింది' చిన్నారులను

అసలు సినిమా ప్రారంభం

రండి.. రండి... ఏడుస్తూ చూద్దాం

తప్పు మీదే... కాదు మీదే

శవాలతో రాజకీయం

చిత్రం.... ఏలే వారు ఒక్కరే

చివికిన భవనమని

'చితి'కి పోవటం ఖాయమని తెలుసు

అయినా... బడుగు బతుకులు

ఆఫ్ట్రాల్..పిల్లలు.. ఓటర్లు కాదు...

పోతే ఎంత?... ఉంటే ఎంత??

విరిగిన.. ఒరిగిన... భవనం

సహాయం కోసం ఎదురుచూపు..

ఆర్తి, ఆశతో ఆ కళ్ళు వేడికోలు

అయినా... మనకెందుకు...?

మన జీతాలు పెరిగాయి

సబ్సిడీ తిళ్లు ఎ.సి. లో ఉన్నాయి..

రండి తిందాం... ఎందరు చావలేదు..

అయినా ఇది ప్రతిపక్షం కుట్ర

రేపటికి 'మామూలే'.. అంతే

ఓ కమిటీ వేద్దాం..

దోషులు ఎంత వారైనా కఠినంగా శిక్షిస్తాం

పత్రికల వారికీ తెలుసు...

తప్పెవరిది... శిక్ష ఎవరికీ?

ఆ ఒక్కటీ అడగొద్దు!

(ఢిల్లీ ఘటన చదివి )

- భమిడిపాటి గౌరీశంకర్,

సెల్‌: 9492858395


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్