ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రగులుతున్న వర్తమానం

1 గంట క్రితం

poetry
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇప్పుడు

హక్కులు కూడబలుక్కుంటున్నాయి

ఆర్టికల్స్ వెన్నులు నిటారు చేసుకుంటున్నాయి.

పెన్నులు పట్టుకున్న చేతులు

ఉద్యమ పిడికిళ్లై ఎగురుతున్నాయి

కళాశాలల్లో విప్లవం ప్రవహిస్తోంది

ఇక కాలేజీలెంతమాత్రమూ లేజీ కాదు..!


లేత బొద్దింకల రొద

ఢిల్లీ పీఠాల నిద్రను దొంగలిస్తోంది

ఎన్ని రాజకీయ ఎగదోతలు

చిచ్చు రగిలిస్తున్నాయంటున్నా,

ఒక అవినీతికి

ఇన్ని ప్రశ్నల కొడవళ్లు యువరక్తాన్నందించడం

భవిష్యత్తుకి శుభసూచకమే..!


అక్కడ రోడ్లనిండా

యంగ్ ఇండియా పల్లవిస్తోంది

అది ఉరికే లాఠీఛార్జిని

జాతీయ గీతాలాపనతో దిగ్బంధనం చేస్తుంది

వాటర్ గన్ పిచకారిమీద నృత్యమై ఆడుతోంది

టియర్ గ్యాస్ అగ్నిని అద్దాల చేతులతో పరావర్తనం చేస్తోంది

గాయపడ్డ జవానులకు

మానవత్వపు సాయమందిస్తోంది..!


యువతకు ఉద్యమం అంటుకుంది

దాని జ్వాల దేశమంతా రగులుతోంది

రాత్రీ.. పగలూ..

ఒక కొత్త ఆశయ పలవరింతలో గడపడమెలాగో

యువతకి ఇది రుచి చూపించింది

న్యాయం చేతుల్లో అవినీతికి ఉరిబడ్డం

దేశానికి కొత్త ఉత్తేజాన్ని అందించింది!


- అన్నం శివకృష్ణ ప్రసాద్

94903 25112

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్