ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

​అబద్ధాల ఋతువు

1 గంట క్రితం

godi media
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇదో అబద్ధాల ఋతువు

నిజాన్ని నిలువునా

జడివానలా మింగేస్తూ

నీడలకే రంగులు అద్ది

వెలుగుల పేరుతో అమ్మేస్తూ ...

​ఇక్కడ

నిజం ఒక ఒంటరి ప్రయాణికుడు

అబద్ధం మాత్రం

ఊరేగింపులతో నడిచే రాజు!

మాటలకు ముసుగులు

ముఖాలకు మేకపోతు నవ్వులు

మనసులకు తాళాలు వేసి

నిశ్శబ్దాన్ని నేర్పిస్తున్న కాలం ఇది

కళ్ల ముందే జరుగుతున్న విషయాన్ని

కలగా మార్చే మాయ,

కలల్ని కూడా వాస్తవమని నమ్మించే వ్యూహం!

చరిత్ర పుటలపై కొత్త రంగులు పూస్తూ,

మరిచిపోవాల్సిన వాటిని గుర్తులుగా నిలబెట్టి,

​గుర్తుంచుకోవాల్సిన గాయాలను

మౌనంలో దాచేస్తున్నారు

ప్రశ్నించే స్వరం గాలిలో కలిసిపోతే,

చప్పట్లు కొట్టే చేతులే నిజానికి సాక్ష్యాలవుతాయి

​నిజం ఎప్పుడూ

అరుపులతోనే కళ్ల ముందుకొచ్చి నిలబడదు

నిశ్శబ్ద విత్తనంలా నేలలో దాగి ఉంటుంది

ఋతువు మారినప్పుడు

ఆ విత్తనం మొలకెత్తుతుంది!

అబద్ధాల మేఘాలు తొలగిపోతాయి

మనిషి కళ్లకు

మళ్లీ వెలుగు కనిపిస్తుంది

​అబద్ధం ఒక ఋతువు మాత్రమే!

నిజం ఒక అనంతమైన ఆకాశం!


​- వైష్ణవి శ్రీ

80742 10263

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్