ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చలిచీమలు

1 గంట క్రితం

cjp protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రేపటి ఆశలను, చూపులను

రేపటి అడుగులను, ఆశయాలను

నడిరోడ్డున ముక్కలు చేసి

దేశ ముఖచిత్రం చూపించారు!

అన్యాయాన్ని అడిగినందుకు

న్యాయం ఎలా ఉంటుందో చూపారు

ప్రశ్నిస్తే దేశద్రోహులంటారు

మౌనంగా ఉంటే మునులు కాదు

చేతగాని చవటలంటారు!

పదవులు, ఉద్యోగాలు కాదు,

భవిష్యత్ కోసం కన్న కలలను

కల్లలు చేయకండి అంటున్నారు,

రేపు మనది కాదు,

వాళ్ల చేతిలో ఉందని మరిచారా!

ఒకరి స్వార్థం కోసం

వేరొకరిని తొక్కేస్తుంటే

కష్టపడేవాడికి విలువెక్కడిది?

ఒక పరీక్ష కోసం చచ్చిపోవాలా..!

నిజాయితీ కరువైన రోజుల్లో

నిజాన్ని దాస్తే మానవత్వం ఇంకెక్కడిది?

చీమలో, బల్లులో, బొద్దింకలో కాదు,

నేల మీద నడిచే రేపటి భవిత వాళ్లు.

బతికే భరోసానివ్వండి, చాలు!

సహనాన్ని పరీక్షించకండి.

"చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ"

వాళ్లకంటే మనకే ఎక్కువ తెలిసిన పద్యమిది.

నిజం కానివ్వకండి,

దేశాన్నే కాదు,

పిల్లల భవితను కూడా కాపాడండి!


- పుట్టి గిరిధర్

94949 62080

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్