విజయవాడ : డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ మృతి సాహిత్య రంగానికి తీరనిలోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెలుగు సాహితీ లోకంలో అభ్యుదయ రచయితగా, ప్రముఖ విమర్శకుడిగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఏటుకూరి ప్రసాద్ (90) శనివారం కన్నుమూశారు. హైదరాబాద్ నారాయణగూడలోని తన స్వగృహంలో వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేసింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తపరిచింది. దీనికి సంబంధించి వి.శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్ధి దశ నుంచే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితులై అధ్యాపక వృత్తిలో స్థిరపడినప్పటికీ గేయ కవిత్వం రచనలో ఏటుకూరి ప్రసాద్ కృషి చేశారని తెలిపారు. నవ చేతన ప్రచురణ సంస్థలకు నాలుగు దశాబ్దాలపాటు సంపాదకులుగా పనిచేశారని చెప్పారు. తాపీ ధర్మారావు పై పిహెచ్‌డి చేసి తాపీ ధర్మారావు జీవితం ` రచనలు పుస్తకాలు వెలువరించారని వివరించారు. జాఘువా రచనలతోపాటు అనేక రచనలు చేశారని అన్నారు. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరనిలోటు అని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఏటుకూరి ప్రసాద్ మృతి సాహిత్య రంగానికి తీరనిలోటు : వి.శ్రీనివాసరావు
24 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 24, 2026, 01:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)