సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిన్ని గుండె చప్పుడు

5 గంటల క్రితం

chilnni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 03:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

నాన్నలాంటి ఆకాశం కావాలి నాకు

అమ్మలాంటి నేలమ్మ కావాలి నాకు

రంగుల సీతాకోక చిలకై ఎగరాలని ఉంది

వానదేవుడితో కలసి ఊయలలూగాలని ఉంది

పుస్తకాల మోతతో నా నవ్వులను నొక్కకండి

మార్కుల పందెంలో నన్ను బొమ్మలా మార్చకండి

నాలోని వెలుగును నన్ను చూడనివ్వండి

నాలాగా నన్ను స్వేచ్ఛగా బతకనివ్వండి

ఒక్క క్షణం నా చేతిని పట్టుకుని చూడండి

నా కళ్లలోని కలల లోకాన్ని చదవండి

నన్ను కాస్త ఆలకించండి, కౌగిట నింపండి

నేను విరిసే పూవునై ఈ లోకానికి సువాసనలందిస్తాను!


- మర్రాపు వసుంధరా దేవి, 94414 67660

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్