బలిసిన ప్రయివేటు పెట్టుబడి
రాకాసి కోరల్లో నలిగి కరిగి
ఉపాధి ఉద్యోగం లేక రాక
బతికే ఆదాయం చాలక
అధిక ధరల మోత బరువై
నీ నెత్తురు నువ్వే కక్కుతూ
నీ సత్తువలో ఐక్యత మరిచి
ఒంటరి ఈగై తిరుగుతుంటావు
లే.. లేలే! దగాపడ్డ భంగపడ్డ
ఒక్కొక్కరినీ పిలువు నిలుపు
మందిగ సాగితే ప్రశ్నేల్లేపితే...
కలిసి కట్టై ఒక్కటై సాగితే ...
సమాధానం అక్కడే దక్కేను
సమాజ మార్పు బీజమయ్యేను
- ఉన్నం వెంకటేశ్వర్లు








కామెంట్‌లు (0)