మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమాకే ఎందుకు ఈ రంపపు కోతలు?

2 గంటల క్రితం

raptadu.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 03, 2026, 04:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

స్థలం మారొచ్చు చావు తథ్యం

మారణాయుధం మారొచ్చు

మరణశాసనం మాత్రం అమలవుతుంది.

​

వయసుతో సంబంధంలేదు

మా మనసుకు విలువే లేదు

మా ప్రాణానికీ అంతేమరి!

చావు ఏవైపు నుండి వస్తుందో

యమపాశం ఎటు నుండి బిగుస్తుందో

కాలయముడు ఏరూపంలో ఉంటాడో

ఒక్కటి మాత్రం ఖాయం

మా ప్రాణాలు గాలిలో కలవడం!

​

ఊపిరి అనంతవాయువుల్లో కలిశాక

అంతా చేరతారు హడవుడిగా

సాంత్వన వాక్యాలు కోకొల్లలు

దూరవాణిలో ఎక్కడినుండో వస్తాయి

మాకు ధైర్యవచనాలు పలుకుతారు

మా దేహాలకు రక్షణ వాగ్దానాలొస్తాయి

ఇక ఉసురు తీసే వాళ్ళపై ఉక్కుపాదమని

ఉత్తుత్తి మాటలు మళ్ళీ వినబడతాయ్.

​

సమంగా ఊపిరి తీసుకోనివ్వని

ఈ వ్యవస్థలో ఇక సమానత్వం ఓ కలేనా!

అసలు మాతృస్వామ్యమొకటి

ఈ భూమి మీద నడిచిందంటే

నమ్మబుద్ధవ్వడంలేదు మాకు

ఉండండి.....

ఎవరిదో అడుగుల సవ్వడి వినిపిస్తోంది

చంపడానికి ఏ కొత్తదనాన్ని

మోసుకొస్తున్నాడో?

​- జంధ్యాల రఘుబాబు,

సెల్‌: 9849753298

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్