తెలంగాణ : రాష్ట్ర స్థాయి బుర్ర నర్సమ్మ–లింగారెడ్డి స్మారక ‘తెలంగాణ తెలుగు తేజం’ సాహిత్య పురస్కారం-2026 కు ప్రముఖ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని పురస్కార కమిటీ ఛైర్మన్ డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాస్యం సేనాధిపతి శుక్రవారం వెల్లడించారు. ఈ నెల 22న కరీంనగర్‌లో పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తెలుగు భాషకు తెలంగాణ మట్టి బిడ్డలు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
సుద్దాల అశోక్ తేజ కు ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 05:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)