శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘కూటమి’ సర్కార్‌కు ఓటమి భయం

35 నిమిషాల క్రితం

టిడిపి కూటమి సర్కార్‌కు ఓటమి భయం
- పోలీసు బలం, ప్రలోభాలు ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం
- విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఎబి వెంకటేశ్వరరావును గెలిపించండి
- సిపిఎం రాష్ర్ట కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 10:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోలీసు బలం, ప్రలోభాలు ప్రభుత్వ బలహీనతకు నిదర్శనం

  • విజయవాడ మేయర్‌ అభ్యర్థిగా ఎబి వెంకటేశ్వరరావును గెలిపించండి

  • సిపిఎం రాష్ర్ట కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ నాయకులు నారాయణ

ప్రజాశక్తి–ఎన్‌‌టిఆర్‌ జిల్లా ప్రతినిధి : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో వామపక్షాలు, కాంగ్రెస్‌ మద్దతుతో పోటీ చేస్తున్న మేయర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, సిపిఐ జాతీయ నాయకులు కె. నారాయణ, స్వతంత్ర మేయర్‌ అభ్యర్థి ఎ.బి. వెంకటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని 37, 38, 40, 41 డివిజన్ల పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ... విజయవాడలో టిడిపి కూటమికి, వైసిపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఇండియా వేదిక అవతరిస్తుందని, పదేళ్ల తర్వాత నగరంలో మళ్లీ చైతన్యవంతమైన రాజకీయ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ ఎన్నికల్లో టిడిపి కూటమిని, వైసిపిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, సిపిఐ, సిపిఎం ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ‘సిలిండర్‌’ గుర్తుపై ఓటు వేసి ఎ.బి. వెంకటేశ్వరరావును గెలిపించాలని కోరారు. వివిధ డివిజన్లలో సీట్ల సర్దుబాటులో భాగంగా పోటీ చేస్తున్న సిపిఐ (కంకి–కొడవలి), సిపిఎం (సుత్తి–కొడవలి–నక్షత్రం), కాంగ్రెస్‌ (హస్తం) అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఓటమి సంకేతాలు అందాయని, అందుకే నేరుగా ఎన్నికలను ఎదుర్కోలేక అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, పోలీసులు, అధికార బలాన్ని ఉపయోగించుకోవడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం తగిన జాగ్రత్తలు తీసుకుని స్వేచ్ఛాయుత, ప్రశాంత ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. కె. నారాయణ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో నగర ప్రజలు తమ రాజకీయ చైతన్యాన్ని చాటాలని కోరారు. అవినీతి రహిత పాలన, నగర సమగ్ర అభివృద్ధి కోసం వామపక్షాలు, కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించిన మేయర్‌ అభ్యర్థి వెంకటేశ్వరరావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విజయవాడ రాజకీయాల్లో ఇది చారిత్రాత్మక సందర్భమని, ప్రజలు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. వ్యాపారులపై ప్రభుత్వ శాఖల ద్వారా జరుగుతున్న వేధింపులు, ఇబ్బందులను తొలగించి, నగరంలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. తనతోపాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ రోడ్‌షోలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, సిపిఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహరావు, సిపిఐ అభ్యర్థులు సూరసాని రామిరెడ్డి, బుద్దె వేణుగోపాల్‌, పంచదార్ల వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.​


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్