శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఫౌజీ’ గ్లింప్స్‌.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలే..

20 గంటల క్రితం

fauzi.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 11:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన ‘ఫైల్ నెం.25 : ఫౌజీ’ ఒరిజినల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.



నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగే గంభీరమైన సంభాషణతో ప్రారంభమవుతుంది. బ్రిటీష్ పాలనలో రెండు వందల ఏళ్లుగా బానిసత్వంలో మగ్గిన భారతీయుల పోరాటంపై హిట్లర్ అనుమానాలు వ్యక్తం చేయగా, భారతీయుల శక్తి, సంకల్పం గురించి అతడికి తెలియదంటూ బోస్ ధీటుగా సమాధానమిస్తారు. తన దేశానికి స్వాతంత్య్రం సాధించి తీరుతానని ఆయన చెప్పే తీరు ఆకట్టుకుంటుంది.

ఆ తర్వాత సింగపూర్‌లో బ్రిటీష్ సేనలకు ఎదురైన పరాజయాలు, బ్రిటీష్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను దెబ్బతీసిన ఓ భారతీయ సైనికుడి గురించి బోస్ వివరించే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సైనికుడిగా, వ్యూహకర్తగా, గూఢచారిగా పనిచేసిన ఆ వ్యక్తే ‘ఫౌజీ’ అని పరిచయం చేసే విధానం కథపై ఉత్కంఠను పెంచుతోంది. ప్రభాస్ పాత్రను ఈ గ్లింప్స్‌లో చూపించిన తీరు అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగిస్తోంది.

ఇక హిట్లర్‌కు చెందిన ‘ఎనిగ్మా’ కోడ్‌తో పోలుస్తూ, భగవద్గీత ఆధారంగా ఫౌజీ రూపొందించిన రహస్య కోడ్‌ను ఛేదించడం బ్రిటీషర్లకు సవాలుగా మారిన అంశం కథలో మరో ఆసక్తికరమైన మలుపుగా కనిపిస్తోంది. చివర్లో ప్రభాస్ గంభీరమైన స్వరంతో చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దేశభక్తి, యుద్ధ వ్యూహాలు, గూఢచర్యం వంటి అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా పీరియాడిక్ యాక్షన్ డ్రామాను అందించనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా, ప్రభాస్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నట్లు ప్రచార సమాచారం పేర్కొంటోంది. గ్లింప్స్‌తోనే ఆసక్తిని పెంచిన ఈ చిత్రం విడుదల సమయానికి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్