బౌలింగ్‌లో మెరిసిన శ్రీచరణి
తొలి వన్డేలో జింబాబ్వే మహిళలపై టీమిండియా గెలుపు
వడోధర: జింబాబ్వే మహిళలపై టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళలజట్టు వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ ఘన విజయం సాధించింది. కోటాంబిలోని బిసిఎ స్టేడియంలో జింబాబ్వే మహిళలతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ప్రతిక రావల్ అజేయ శతకంతో రాణించడంతో జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. 198పరుగుల స్వల్ప ఛేదనలో భాగంగా ఓపెనర్లు ప్రతిక రావల్(100నాటౌట్), కెప్టెన్ మంధాన(32) తొలి వికెట్‌కు 94పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత స్మృతి మంధాన ఔటైనా.. షెఫాలీ వర్మ(64నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. దీంతో జింబాబ్వే నిర్దేశించిన లక్ష్యాన్ని టీమిండియా 27.1ఓవర్లలో మంధాన వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే మహిళలను తెలుగు తేజం శ్రీచరణి(4/23) తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేసింది. క్రాంతి గాడ్(3/42), దీప్తి శర్మ(2/44) కూడా బౌలింగ్‌లో రాణించడంతో జింబాబ్వే జట్టు 197పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో బీలవ్డ్ బీజా 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మావుంగా(29), ముపాచిక్వా(25) రాణించారు. కాగా ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్రతికా రావల్‌కు లభించగా.. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యతలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం ఇదే మైదానంలో జరగనుంది.
స్కోర్‌బోర్డు...
జింబాబ్వే మహిళల ఇన్నింగ్స్: ముపఛిక్వా (సి)క్రాంతి గాడ్ (బి)శ్రీచరణి 25, పిర్ల్ (సి అండ్ బి)క్రాంతి గాడ్ 1, తిరిపానో (ఎల్‌బి)శ్రీచరణి 21, బెలోవెడ్ బిజా (సి)మంధాన (బి)క్రాంతి గాడ్ 62, మయర్స్ (సి)సయాలీ (బి)దీప్తి 8, గ్వాంజురా (సి అండ్ బి)శ్రీచరణి 13, దురూరూ (బి)క్రాంతి గాడ్ 10, మవుంగా (సి)కలిత (బి)శ్రీచరణి 29, సిబందా (ఎల్‌బి)షెఫాలీ 2, మకూషా (బి)దీప్తి శర్మ 10, ఒలిండర్ ఛారే (నాటౌట్) 4, అదనం 12. (49.5ఓవర్లలో ఆలౌట్) 197పరుగులు.
వికెట్ల పతనం: 1/3, 2/46, 3/55, 4/70, 5/113, 6/140, 7/180, 8/183, 9/183, 10/197
బౌలింగ్: క్రాంతి గాడ్ 10-1-42-3, సయాలీ 7-0-33-0, కలిత 5-0-23-0, శ్రీచరణి 10-3-23-4, దీప్తి 9.5-1-44-2, షెఫాలీ వర్మ 8-0-28-1.
ఇండియా మహిళల ఇన్నింగ్స్: ప్రతికా రావల్ (నాటౌట్) 100, మంధాన (సి)బిజా (బి)ఛారే 32, షెఫాలీ వర్మ (నాటౌట్) 64, అదనం 4. (27.1ఓవర్లలో వికెట్ నష్టానికి) 200పరుగులు.
వికెట్ల పతనం: 1/94
బౌలింగ్: సిబందా 2-0-20-0, గ్వాంజురా 2.1-0-22-0, మవుంగా 2-0-19-0, మకూషా 5-0-25-0, పిర్లే 5-0-28-0, ఛారే 7-0-58-1, బిజా 4-0-28-0.







కామెంట్‌లు (0)