ఉప్పుగుండూరులోని చింతతోపు కాలనీవాసుల నిర్ణయం
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) : ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఓటు అమ్ముకోం.. ఓటుకు నోటు వద్దు.. మా కాలనీ అభివృద్ధే మాకు ముఖ్యం..’ అని నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీ, చింతతోపు కాలనీవాసులు తీర్మానించారు. అందరూ ఐక్యంగా సామాజిక సేవా కార్యకర్త తెలగతోటి శామ్యూల్ ఆధ్వర్యంలో గురువారం ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో నాయకులు కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి.. ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత తమను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాలనీలోని 35 కుటుంబాల వారు ఐక్యంగా ఏకతాటిపై నిలిచారు. ‘మా ఓటుకు నోట్లు వద్దు.. మా కాలనీ అభివృద్ధే మాకు ముఖ్యం..’ అంటూ కాలనీ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో వారికే ఓట్లు వేస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు వాల్ పోస్టర్ అంటించారు. కాలనీకి సరైన రోడ్లు లేవని, విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. తదితర సమస్యలకు పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)