గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసింగపూర్ నౌకలోని సిబ్బంది సురక్షితం..

2 గంటల క్రితం

సింగపూర్ నౌకలోని సిబ్బంది సురక్షితం
- రక్షించిన కోస్ట్ గార్డ్ అధికారులు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 09:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రక్షించిన కోస్ట్ గార్డ్ అధికారులు

ప్రజాశక్తి - మొగల్తూరు (పశ్చిమగోదావరి జిల్లా) : అర్నబ్ తుపాన్ ధాటికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపాన సముద్రంలో చిక్కుకుపోయిన సింగపూర్ నౌకలోని సిబ్బందిని తరలించేందుకు గురువారం కోస్టుగార్డు, పోలీస్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్‌ ‌నిర్వహించారు. తొలుత మొగల్తూరు నుంచి హెలికాప్టర్‌‌లో సంఘటనా స్థలానికి వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు ట్రయల్స్‌ వేశారు. కోస్టుగార్డు అధికారులు ప్రత్యామ్నాయంగా మరో ఓడను సింగపూర్ నౌక చిక్కుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి అందులోని సిబ్బందిని సురక్షితంగా తరలించారు. హెలికాప్టర్ వినియోగం లేకుండానే వారిని రక్షించారు. మొగల్తూరు నుంచి ప్రయత్నం చేసిన వారిలో డిఎస్‌‌పి మేక సుధాకరరావు, ఆర్అండ్‌‌బి డిఇ కిరణ్ కుమార్, సిఐ ఎం.నాగరాజు, ఎస్‌ఐ జి.వాసు, కోస్టుగార్డు కమాండెంట్ పలువురు సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్