గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతుపాను ప్రభావిత ప్రాంతాల్లో.. పారిశుధ్య పనులకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్

1 గంట క్రితం

teskforece.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 09:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • పంచాయతీరాజ్‌ ‌శాఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు, అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్‌ ‌శాఖ వెల్లడించింది. తుపాను ప్రభావిత తొమ్మిది జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందిని ఈ పనుల కోసం కేటాయించారు. క్షేత్రస్థాయిలో నాలుగేసి మంది సభ్యులతో బృందాలను ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు చేపట్టినట్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. తుపాను కారణంగా గ్రామాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఏర్పడిన నీటి నిల్వలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం, బ్లీచింగ్, క్లోరినేషన్ చేపట్టడం వంటి పనులకు ఈ ప్రత్యేక బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయని తెలిపింది. తుపాను ప్రభావిత గ్రామాల్లో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అందుకోసం కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి 48 మంది సాంకేతిక సిబ్బందిని కేటాయించినట్లు, ఈ బృందాల్లో డిఇ, ఎఇ, కెమిస్టులు, మైక్రోబయా లజిస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారని తెలిపింది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ తాగునీటి వనరులు, సరఫరా అవుతున్న నీటి నాణ్యతను అక్కడికక్కడే ఈ బృందాలు పరీక్షిస్తాయని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్