ఛాలెంజ్ లక్ష్యాన్ని ఛేదించిన ఛత్తీస్‌గడ్
ప్రజాశక్తి-విజయవాడ స్పోర్ట్స్ : మూలపాడులోని డివిఆర్‌ఎ స్టేడియంలో నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠభరిత రంజీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఓటమిపాలైంది. మూడోరోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. తొలి ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గడ్ 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆ జట్లు 6 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత సంపాదించింది. అనంతరం ఆంధ్రప్రదేశ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 184 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి ఛత్తీస్‌గడ్ ముందు 179 పరుగుల ఛాలెంజ్ లక్ష్యాన్ని నిలిపింది. ఆ లక్ష్యాన్ని ఛత్తీస్ గడ్ 35.1ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి సంచలన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు 231 పరుగులు చేయగా.. రెండోరోజు ఆట ముగిసేసరికి ఛత్తీస్‌గడ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోర్‌తో గురువారం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఛత్తీస్‌గడ్ మరో 21 పరుగులు జతచేసి చివరి రెండు వికెట్లు కోల్పోయింది.
హైదరాబాద్-పంజాబ్ మ్యాచ్ డ్రా
జింఖానా మైదానంలో పంజాబ్‌తో జరిగిన మరో రంజీ మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు 431 పరుగులు చేయగా.. హైదరాబాద్ జట్టు 380 పరుగులకు ఆలౌటైంది. చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌లో పంజాబ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 240 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. దీంతో మ్యాచ్ డ్రా అయ్యింది.








కామెంట్‌లు (0)