ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపట్టణ స్థానిక ఎన్నికలు ప్రశాంతం

1 గంట క్రితం

పట్టణ స్థానిక ఎన్నికలు ప్రశాంతం
- డిజిపి హరీష్ కుమార్ గుప్తా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 10:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • డిజిపి హరీష్ కుమార్ గుప్తా

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఆదివారం నిర్వహించిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని డిజిపి హరీష్‌ కుమార్ గుప్తా తెలిపారు. 20 జిల్లాల నుంచి 41 ఘటనలకు సంబంధించిన సమాచారం అందినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎన్నికల పోలింగ్ సరళి, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా వీడియోగ్రఫీ, డ్రోన్లు, బాడీ వోర్న్ కెమెరాలు, సమర్థ్ యాప్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద నిరంతర భద్రత కొనసాగుతుందని పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్