బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకూటమికి 12 కార్పొరేషన్లు

1 గంట క్రితం

tdp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 12:02 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • అనంతపురంలో వైసిపి గెలుపు

  • కడపలో తొలిసారి టిడిపికి మేయర్‌ స్థానం

ప్రజాశక్తి - యంత్రాంగం : స్థానిక ఎన్నికల్లో మొత్తం 13 కార్పొరేషన్లకు 12 స్థానాలు కూటమికి దక్కాయి. టిడిపికి పది, జనసేనకు రెండు, వైసిపి అనంతపురం కార్పొరేషన్‌ స్థానం దక్కింది. బిజెపి ఖాతా తెరవలేదు. టిడిపి పది స్థానాలు విజయనగరం, ఒంగోలు, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు , నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, తిరుపతి, కడప , వైసిపి అనంతపురం, జనసేన ఏలూరు, ఎన్‌టిఆర్‌ మేయర్ స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 922 డివిజన్లకు టిడిపి 556, వైసిపి 102, జనసేన 131, బిజెపి 39, సిపిఎం రెండు, ఇండిపెండెంట్స్‌ 33 డివిజన్లు గెలుపొందారు. 59 వార్డులు ఫలితాలు వెలువడలేదు. మున్సిపాలిటీ, నగర పంచాయతీకి సంబంధించి మొత్తం 3942 వార్డులకు గాను 755 ఏకగ్రీవం కాగా ఒక స్థానంలో పోటీ జరగలేదు. టిడిపి 2535, వైసిపి 539, జనసేన 476, బిజెపి 152, సిపిఐ ఆరు, సిపిఎం ఆరు, బిఎస్‌పి ఒకటి, ఇతర పార్టీలవారు రెండు, ఇండిపెండెంట్స్‌ 121 స్థానాలు గెలుపొందారు.

గ్రేటర్‌ ‌విశాఖ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ (‌జివిఎంసి) మేయర్‌గా కూటమి బలపర్చిన టిడిపి అభ్యర్థి ముక్కా శ్రావణి గెలుపొందారు. ‌జివిఎంసి 120 వార్డుల్లో 10,37,072 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ముక్కా శ్రావణికి 5,93,848 (పోస్టల్ బ్యాలెట్ ఓట్లు – 609) ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి, వైసిపి అభ్యర్థి వరుదు కల్యాణికి 3,46,031(పోస్టల్ బ్యాలెట్ ఓట్లు – 414) ఓట్లు వచ్చాయి. 2,47,817 ఓట్ల మెజార్టీతో కూటమికి చెందిన టిడిపి అభ్యర్థి ముక్కా శ్రావణి విజయం సాధించారు. 120 వార్డుల కార్పొరేటర్ల స్థానాల్లో టిడిపికి 64, జనసేనకు 26, బిజెపికి 8 కలిపి మొత్తం కూటమికి 98 వార్డులు దక్కాయి. వైసిపి 13 వార్డుల్లో, స్వతంత్రులు 8, సిపిఎం 1 వార్డులో విజయం సాధించారు. కడప నగర పాలక సంస్థ మేయర్‌‌గా కూటమి అభ్యర్థి మట్లి సువర్ణ విజయం సాధించారు. 66 డివిజన్లలో 52 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మట్లి సువర్ణకు 1,31,615 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి బండి దీప్తికి 66,027 ఓట్లు వచ్చాయి. 65,588 ఓట్ల మెజార్టీతో సువర్ణ విజయం సాధించారు. కడప నగర పాలక సంస్థ ఏర్పడిన తర్వాత టిడిపి తొలిసారిగా మేయర్‌ ‌పీఠం కైవసం చేసుకుంది.

విజయనగరం మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌చైర్మన్ గా టిడిపి అభ్యర్థి అవనాపు భార్గవికి 76,074 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి అభ్యర్థి వైసిపికి చెందిన కోలగట్ల శ్రావణికి 57,519 ఓట్లు వచ్చాయి. 18,555 ఓట్ల మోజార్టీతో భార్గవి గెలుపొందారు. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడుకు 77,078 ఓట్లు పోలవ్వగా, తన ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి 37,929 ఓట్లు వచ్చాయి. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా టిడిపికి చెందిన నల్లమల్లి శ్రీశిల్పకు 82,674 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి కుప్పం ప్రసాద్‌కు 45,048 ఓట్లు వచ్చాయి.37,626 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా వైసిపికి చెందిన రమేష్‌గౌడ్‌కు 62,219 ఓట్లు రాగా తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి అజయ్‌ యాదవ్‌కు 56,238 ఓట్లు వచ్చాయి. మెజార్టీ 5981 ఓట్లతో రమేష్‌గౌడ్‌ గెలుపొందారు.

నెల్లూరులో టిడిపి అభ్యర్థి రూప్‌ కుమార్‌ యాదవ్‌కు 1,70,440 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డికి 89,719 ఓట్లు లభించాయి. 80,172 ఓట్ల మెజార్టీతో రూప్‌కుమార్‌ గెలుపొందారు. గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ‌మేయర్‌‌గా టిడిపి నుంచి పోటీ చేసిన కోవెలమూడి లక్ష్మి అపర్ణకు 2,08,925 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి శ్రీదేవికి 1,12,631 ఓట్లు వచ్చాయి. 92,294 ఓట్ల మెజార్టీతో అపర్ణ గెలుపొందారు. తిరుపతి మేయర్ టిడిపి అభ్యర్థిగా మన్నెం శ్రీనివాస్‌కు 94,937, వైసిపి అభ్యర్థి 33,355 ఓట్లు వచ్చాయి. 61,712 ఓట్లతో శ్రీనివాస్‌ గెలుపొందారు. చిత్తూరు మేయర్ కఠారి హేమలత (టిడిపి)కు 61,278, సమీప అభ్యర్థి బత్తలపల్లి చంద్రశేఖర్ (వైసిపి)కు 27,162 వచ్చాయి. 35,116 మెజార్టీతో హేమలత విజయం సాధించారు. కర్నూలు మేయర్ విజయ ప్రత్యూష (టిడిపి)కు 1,28,88 ఓట్లు రాగా, ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి ఊతకళ్ల సుశీలకు 1,01,855 ఓట్లు వచ్చాయి. 27,033 ఓట్ల మెజార్టీతో ప్రత్యూష గెలుపొందారు. విజయవాడ నగర పాలక సంస్థ మేయర్‌‌గా కూటమి నుండి పోటీచేసిన జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కు మొత్తం 2,65,888 ఓట్లు రాగా, భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ ‌బలపరచిన స్వతంత్ర అభ్యర్థి, మాజీ ఐపిఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు వచ్చాయి. మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్‌‌గా టిడిపి అభ్యర్థి అబ్దుల్‌ అబీదా 62,930 ఓట్లు, వైసిపి అభ్యర్థి లంకా జ్యోతికి 30,273 ఓట్లు వచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్