మంగళవారం, 03 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionముగిసిన పరిషత్‌ ఎన్నికల ప్రచారం..

1 గంట క్రితం

ముగిసిన పరిషత్‌ ఎన్నికల ప్రచారం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 01:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎంపిటిపి, జెడ్‌పిటిసి ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. పది రోజులపాటు హోరెత్తించిన ప్రచారానికి తెరపడటంతో అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం, నగదు, తాయిళాల పంపిణీపై దృష్టి సారించారు. ఇంటింటికీ వెళ్లి తమకు ఓటు వేయాలని అభ్యర్థించిన నాయకులు.. చివరి అంకంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,829 ఎంపిటిసి, 659 జెడ్‌పిటిసి స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 1,985 ఎంపిటిసి, 77 జెడ్‌పిటిసి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 7,844 ఎంపిటిసి, 582 జెడ్‌పిటిసి స్థానాలకు ఈ నెల 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు ‌విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్