ప్రజాశక్తి-తిరుపతి (మంగళం): తిరుపతి రూరల్ మండల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి 602 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ముచ్చెలి ధనలక్ష్మిపై ఆయన విజయం సాధించారు. కౌంటింగ్లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి 41,119 ఓట్లు రాగా, ముచ్చెలి ధనలక్ష్మికి 40,517 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్లలో వైసీపీకి 177, టీడీపీకి 216 ఓట్లు నమోదయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో చివరకు హర్షిత్ రెడ్డి విజయం ఖరారైంది. ఈ విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి.
తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం
26 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 08, 2026, 07:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)