దీపావళి అంటే దీపాల వెలుగులు, ఆనందాల సందడి మాత్రమే కాదు.. అందమైన దుస్తులతో కొత్త లుక్‌లో మెరిసిపోయే సందర్భం కూడా. ఈ పండుగకు సంప్రదాయ వస్త్రధారణకు ఆధునిక ఫ్యాషన్‌ను జోడిస్తే ప్రత్యేక ఆకర్షణగా నిలవొచ్చు. మహిళలు పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ లెహంగాలు, అనార్కలీ డ్రెస్‌లను ఎంచుకోవచ్చు. పాస్టెల్ రంగులతో పాటు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, మెరూన్ రంగులు పండుగకు మరింత కళను తీసుకొస్తాయి. పురుషులు కుర్తా పైజామా, ఇండో వెస్ట్రన్ దుస్తులు, నెహ్రూ జాకెట్లు.. పిల్లలకు రంగురంగుల లంగా జాకెట్లు, లెహంగాలు, కుర్తా సెట్లు అందంగా ఉంటాయి. దుస్తులకు తగిన ఆభరణాలు, పాదరక్షలు, చిన్న హ్యాండ్‌బ్యాగ్ రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. అయితే ఫ్యాషన్‌తో పాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి. దీపాలు వెలిగించే సమయంలో సులభంగా కదలగలిగే, మంటలకు తగలని నూలు దుస్తులను ఎంచుకోవాలి. ఈ దీపావళికి అదనపు సొబగులతో స్టైలిష్‌గా మెరిసిపోండి!











కామెంట్‌లు (0)