బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపెరిదేపిలో సిపిఎం అభ్యర్థికి బెదిరింపులు

2 గంటల క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 10:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అభ్యర్థికి, ఎన్నికల ఏజెంట్లకు
    భద్రత కల్పించాలని కలెక్టర్‌కు వినతి

ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. ప్రకాశం జిల్లా కొండపి మండలం పెరిదేపి ఎంపిటిసి స్థానానికి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి పుట్టా విజయలక్ష్మిని ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. పోలీసుల అండతో బైండోవర్ కేసులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారు. కొండపి మండలంలోని 12 ఎంపిటిసి స్థానాలకు గాను పది స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, పెరిదేపి స్థానానికి మాత్రమే ఎన్నిక జరగనుంది. మిగిలిన స్థానాల మాదిరిగానే పెరిదేపిలోనూ పోటీ నుంచి తప్పుకోవాలని సిపిఎం అభ్యర్థి విజయలక్ష్మిపై అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. జయలక్ష్మికి మద్దతుగా ఉన్న మిట్టపాలెం గ్రామానికి చెందిన ఎం కొండయ్య, కొల్లూరి సుబ్బారావు, ధర్నాశి ఈశ్వరరావు, ధర్నాశి చంద్రశేఖర్, ధర్నాశి పవన్ సహా మొత్తం పది మందిని బైండోవర్ పేరుతో పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి నిర్బంధించారు. రేగలగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన వారిని సైతం స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని సిపిఎం అభ్యర్థి పుట్టా విజయలక్ష్మికి, ఆమె ఎన్నికల ఏజెంట్లకు తగిన భద్రత కల్పించాలని సిపిఎం జిల్లా నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్ పి రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కె మాబు, కార్యదర్శివర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు బి రఘురామ్_ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్