యుపి : 1000 కిలోల నాణ్యత లేని రసగుల్లాలను అధికారులు సీజ్ చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. రక్షాబంధన్ సందడి నెలకొన్న వేళ .. స్వీట్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఈ పండుగను ఆసరా చేసుకొని కొందరు దుండగులు కల్తీ దందాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్‌లో భారీ కల్తీ వ్యాపారం వెలుగుచూసింది. ఓ గోదాంలో తయారుచేస్తోన్న 1000 కిలోల నాణ్యత లేని రసగుల్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాఖీ పండగను పురస్కరించుకుని గాజియాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గత కొన్ని రోజులుగా స్థానిక ఆహార విక్రయ దుకాణాల్లో సోదాలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బిహారీపురా ప్రాంతంలోని ఓ గోదాంలో పెద్ద ఎత్తున కల్తీ స్వీట్లను తయారుచేసి నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో ఆ వేర్‌హౌస్‌పై అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ కల్తీ పన్నీర్, చక్కెర, రసాయనాలతో తయరుచేసిన రసగుల్లాలను గుర్తించారు. కొన్ని శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. వెయ్యి కిలోల మిఠాయిలను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. గోదాం నిర్వాహకుల లైసెన్స్ రద్దుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఆగస్టు 14 న కూడా గాజియాబాద్‌లోని పలు డైరీ ఉత్పత్తుల దుకాణాల్లో ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అధికారులు సోదాలు జరిపారు. అందులో భాగంగా పలు దుకాణాల నుంచి 868 కేజీల కల్తీ పన్నీర్, 170 కిలోల నాణ్యత లేని కోవాను స్వాధీనం చేసుకుని దాన్ని అక్కడికక్కడే నిరుపయోగంగా మార్చారు.
1000 కిలోల కల్తీ రసగుల్లాలు సీజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)