సోమవారం, 16 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రేకులు లేకుండానే..

6 గంటల క్రితం

రైల్వే భద్రత గాల్లో దీపమే ! 
- బ్రేకులు లేకుండానే 463 కిమీ ‘వందేభారత్‌’ పరుగులు 
- పైలెట్లు చెప్పిన పట్టించుకోని రైల్వే యంత్రాగం 
- రైల్వే శాఖ తీరుపై సర్వత్రా ఆందోళన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 11:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- వందేభారత్‌ పరుగులు

- పైలెట్లు చెప్పినా పట్టించుకోని రైల్వే యంత్రాంగం

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హయాంలో భారతీయ రైల్వేలో భద్రత గాల్లో పెట్టిన దీపంగా మారిపోయింది. అక్టోబర్‌ 24న వందేభారత్‌ రైలును సరైన బ్రేకింగ్‌ వ్యవస్థ లేకండా ఏకంగా 463 కిలోమీటర్ల నడిపిన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. విమర్శలు వెల్లువెత్తడంతో విచారణ జరిపిం చాలని సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ రాంచి డివిజన్‌ రైల్వే మేనేజర్‌ (డిఆర్‌ఎం)కు ఆదేశాలు జారీ చేసింది.

ఏం జరిగిందంటే..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఝార్ఖండ్‌లోని హతియా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ వరకు ఓ ఖాళీ వందే భారత్ రైలును గూడ్స్‌ ఇంజిన్‌ సాయంతో నడపాల్సి వచ్చింది. హతియా నుంచి బయల్దేరాక నిబంధనల ప్రకారం లోకోపైలట్‌ బ్రేక్‌ ఫీల్, బ్రేక్‌ పవర్‌ పరీక్ష‍ నిర్వహించారు. అది సరిగ్గా పనిచేయడం లేదని గుర్తించి.. రాంచీ స్టేషన్‌ చేరుకున్నాక అక్కడి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ.. రైలును అలాగే వెళ్లనిచ్చేందుకు వారు అనుమతించారు. ఆ తర్వాత మురి స్టేషన్ నుంచి రైలును నడిపిన మరో లోకో పైలట్ కూడా బ్రేకింగ్ పనితీరు సరిగా లేదని కంట్రోలర్లకు తెలియ జేశారు. అక్కడ కూడా సరిగా పనిచేయని బ్రేకింగ్‌ వ్యవస్థతోనే ముందుకు వెళ్లాలంటూ పచ్చజెండా ఊపేశారు. చివరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌ సిబ్బంది రైలును తనిఖీ చేయగా.. వందే భారత్‌ అన్ని కోచ్‌లలో బ్రేకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు (ఐసొలేట్ చేసినట్లు) గుర్తించారు. వందే భారత్ బ్రేకింగ్ వ్యవస్థను గూడ్స్ ఇంజిన్‌తో అనుసంధా నించక పోవడంతో బ్రేకులు పనిచేయలేదని తేల్చారు. కేవలం ఇంజిన్ బ్రేకులు, రీజనరేటివ్ బ్రేకింగ్‌పై ఆధారపడి రైలు సుమారు 463 కి.మీ ప్రయాణిం చిందని.. ఈ వ్యవహారంలో సంబంధిత సిబ్బంది అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రాథమిక విచారణలో తేలింది. తగినంత బ్రేక్ పవర్‌ లేకుండా రైలును నడపడం అనేది తీవ్రమైన భద్రతాపరమైన లోపమని.. ఇది ఇతర రైళ్లకు ముప్పుగా పరిణమించడంతోపాటు సిబ్బంది ప్రాణాలనూ ప్రమాదంలో పడేస్తుందని సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ పేర్కొంది. అయితే సిగ్నల్‌ వ్యవస్థ మొదలు సర్వం ముక్కలుముక్కలుగా విడగొట్టి నిర్వహణను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టడం వల్లే ఇలాంటి మానవ నిర్లక్ష్యాలకు కారణమవుతోందని రైల్వే రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్