న్యూఢిల్లీ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 40 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను శనివారం ప్రకటించింది. ధూరి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి పోటీ చేయనున్నారు. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం అనంతరం అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్లు భగవంత్ మాన్ తెలిపారు. తన పేరుతో సహా మొత్తం 40 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు వెల్లడించారు.
117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి 2027 ప్రారంభంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఫిబ్రవరి–మార్చి నెలల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం 2027 మార్చి 16తో ముగియనుంది.








కామెంట్‌లు (0)