మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో పాఠశాలల్లో నేటి నుండి హైబ్రిడ్ విద్యా విధానం అమలు

12 నవంబర్, 2026

ఢిల్లీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 08:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలల్లో హైబ్రిడ్ విద్యా విధానాన్ని అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. జిరాప్-3 నిబంధనల ప్రకారం నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాల్లో ఐదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులో ఉన్న పాఠశాలలు విద్యార్థులకు రెండు విధానాల్లో హాజరయ్యే అవకాశం కల్పించాలి. ఈ ఆదేశాలు ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక, ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలకు వర్తిస్తాయి.

మరోవైపు, ఘజియాబాద్‌లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నవంబర్ 20 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు సంబంధిత శాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రోడ్లపై యాంత్రిక శుభ్రత, నీటిని చల్లే కార్యక్రమాలను రెట్టింపు స్థాయిలో చేపట్టాలని సూచించారు. అధికారుల ఆదేశాలను ఉల్లంఘించే పాఠశాలలు, సంబంధిత శాఖలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్