శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఢిల్లీలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీతో సహా ప్రముఖ నేతలు అరెస్టు

1 గంట క్రితం

cpim
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 11:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వరకు చేపట్టనున్న పాదయాత్రకు ముందు సీపీఐ(ఎం) ప్రముఖ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. బేబీతో పాటు పలువురు సీనియర్ నాయకులను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బృందా కరత్, ఎం.వి. గోవిందన్, పి.కె. శ్రీమతి, పి. రాజీవ్ ఉన్నారు. ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వరకు పాదయాత్ర చేపట్టేందుకు నాయకులు సిద్ధమవుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో క్రూరమైన అణచివేతకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్య హక్కులు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు సంబంధించిన అంశాలపై సీపీఐ(ఎం) ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది.





సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్