శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రీత్‌ టెస్ట్‌కు ఆలస్యం.. 8 మంది పైలట్లపై సస్పెన్షన్‌

3 గంటల క్రితం

Delay in breath test... 8 pilots suspended.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 11:44 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : విమాన సిబ్బంది భద్రతా నిబంధనల విషయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ కఠిన చర్యలు తీసుకుంది. నిర్ణీత సమయంలో బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షకు హాజరుకాని 8 మంది పైలట్లను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసింది. దుబాయ్‌ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సిబ్బంది.. విమానం అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌ దాస్‌ జీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన రెండు గంటల్లోపు పోస్ట్‌-ఫ్లైట్‌ డిక్లరేషన్‌, బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే నిర్ణీత గడువు ముగిసిన 35 నిమిషాల తర్వాత వారు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలో మద్యం సేవించినట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోయినా.. నిర్ణీత సమయంలో పరీక్షకు హాజరుకాకపోవడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పరిగణించిన సంస్థ, ఈ విషయాన్ని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం 8 మంది పైలట్లపై మూడు నెలల సస్పెన్షన్‌ వేటు వేసింది. ఇటీవల ఫుకెట్‌-ఢిల్లీ విమానానికి సంబంధించిన ఘటనలో పైలట్‌-ఇన్‌-కమాండ్‌ డ్రగ్‌ పరీక్షలో గంజాయి సేవించినట్లు నిర్థారణ అయిన నేపథ్యంలో.. ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ పైలట్లకు డోప్‌ టెస్టులను కూడా తప్పనిసరి చేశారు. విమాన భద్రతలో చిన్నపాటి నిబంధన ఉల్లంఘనకూ చోటులేదని తాజా చర్య మరోసారి స్పష్టం చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్