గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మెటాపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ ఎఫ్‌ఐఆర్

3 గంటల క్రితం

meta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 02:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : : చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు అందుబాటులో ఉన్నాయన్న ఆరోపణలపై మెటాకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్‌ అక్టోబర్‌ 8న మెటాతో పాటు దాని అనుబంధ సామాజిక మాధ్యమాలైన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లపై కూడా కేసు నమోదు చేసింది. సమాచార సాంకేతిక చట్టం, 2000లోని సెక్షన్లు 67, 67బీ కింద ఈ కేసు నమోదైంది. ఈ తరహా కంటెంట్‌కు సంబంధించి అందిన ఫిర్యాదు ఆధారంగా సుమారు 10 లింకులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వాటిపై దర్యాప్తు ప్రారంభించామని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్‌ఎస్‌ఒ) అదనపు పోలీసు కమిషనర్ సంజయ్ భాటియా వెల్లడించారు. ఈ కేసును ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్‌ దర్యాప్తు చేస్తోందని ఆయన తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్