శనివారం, 10 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్
Live News

LIVE: నిర్బంధంలో ఢిల్లీ

2 గంటల క్రితం

delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026, 07:15 పూర్వాహ్నం | 0 నిమిషాల చదవడం



Live Updates
3 minutes agoOct 10, 2026 09:43 AM IST

సంసద్ మార్గ్ ప్రాంతంలో కొందరు నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు




Live Updates
about 1 hour agoOct 10, 2026 08:55 AM IST

ఢిల్లీ: ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థి , యువజన సంఘాల నిరసన ప్రదర్శన నేపథ్యంలో, హోటల్ లే మెరిడియన్ సమీపంలోని రౌండ్‌అబౌట్ వద్ద భారీ భద్రతను మోహరించారు. ఢిల్లీ పోలీసు సిబ్బందితో పాటు, ఆర్ఏఎఫ్ , ఢిల్లీ పోలీసుల పింక్ ఫోర్స్ మరియు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా మోహరించారు.





Live Updates
about 1 hour agoOct 10, 2026 08:41 AM IST

జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. లోనీ గోల్ చక్కర్ మరియు అప్సరా సరిహద్దు వద్ద ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.





Live Updates
about 1 hour agoOct 10, 2026 08:33 AM IST

నిరసన కోసం జంతర్ మంతర్ వద్ద గుమిగూడడం ప్రారంభించిన కొంతమంది నిరసనకారులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.




Live Updates
about 1 hour agoOct 10, 2026 08:51 AM IST

ఢిల్లీ: నేటి నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్ ప్రాంతాల్లో భారీ భద్రతను మోహరించారు, బారికేడ్లను ఏర్పాటు చేశారు.



Live Updates
about 2 hours agoOct 10, 2026 07:55 AM IST

ఢిల్లీ : ఓట్ల దొంగ ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, అప్రజాస్వామికంగా తొలగించబడిన 13 కోట్ల మంది ఓటర్లని తిరిగి చేర్పించాలని, ఓటు హక్కు కాపాడాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఢిల్లీలో ఆందోళనను అడ్డుకొనే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో హెచ్‌కేఎస్ సుర్జీత్ భవన్‌లోని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ కార్యాలయంలో విద్యార్థులను భయపెట్టేందుకు ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని సీపీఐ(ఎం) నాయకులు వెంటనే తిప్పికొట్టారు.



Live Updates
about 2 hours agoOct 10, 2026 07:55 AM IST

ఢిల్లీలో రైల్వే స్టేషన్ వద్ద బీఎస్‌ఎఫ్, పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. తెల్లవారుజామున రైళ్ల నుంచి స్టేషన్‌కు చేరుకుని బయటకు వస్తున్న ప్రయాణికులపై నిఘా ఉంచేందుకు సాయుధ బీఎస్‌ఎఫ్ సిబ్బంది, ఢిల్లీ పోలీసు సిబ్బంది కాపలా కాస్తున్నట్లు సమాచారం.




సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్