సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు

2 గంటల క్రితం

cji
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 09:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సిజెఐ

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దని ఆ కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సూర్యకాంత్‌ ‌స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సిఇసి) జ్క్షానేష్‌ ‌కుమార్‌‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల సమయంలో న్యాయవాదులను నిర్బంధించడాన్ని సవాల్‌ ‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ ‌విచారణ సందర్భంలో సిజెఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పిటిషన్‌‌ విచారణను మంగళవారానికి జాబితా చేశారు. నిరసనల రాజకీయాల్లోకి సుప్రీంకోర్టును లాగొద్దని, కోర్టు పనితీరుకు, న్యాయవాదులు, వ్యాజ్యదారుల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దని సిజెఐ పేర్కొన్నారు.

అలాగే, ‘నిరసనకారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సుప్రీంకోర్టును ఇలాంటి వాటిలోకి లాగకూడదు. నిరసన శాంతియుతంగా జరగాలి. కోర్టు పనితీరుకు గానీ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వ్యాజ్యదారుల రాకపోకలకు గానీ ఎటువంటి ఆటంకం లేదా అడ్డంకి ఉండకూడదు" అని సిజెఐ తెలిపారు. ఈ పిటిషన్‌‌పై ప్రస్తుతానికి తాను ఏమీ చెప్పదలచుకోలేదని సిజెఐ అన్నారు. నిర్బంధాలు, ప్రజా సేవలపై ఆంక్షలను సవాలు చేసే ఇతర పిటిషన్లతో పాటు, దీన్ని కూడా మంగళవారం విచారణకు జాబితా చేస్తానని సిజెఐ తెలిపారు. ఇండియా వేదిక నాయకులు సోమవారం సుప్రీంకోర్టుకు మార్చ్‌ ‌నిర్వహించిన సమయంలో సిజెఐ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పిటిషన్‌‌ను సీనియర్ న్యాయవాది ఆత్మారామ్ నాద్కర్ణి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌‌సిబిఎ) అధ్యక్షుడు ప్రదీప్ రాయ్‌‌లు సిజెఐ నేతృత్వం వహిస్తున్న ధర్మాసనం ముందుకు తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాదులను పోలీసులు వీధుల్లో ఈడ్చుకెళ్లారని, ఇలాంటి ఘటనలు గతంలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్