చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా అండిపట్టి సమీపంలోని తెక్కంపట్టి సబ్ జైలు నుంచి సోమవారం రాత్రి 17 మంది రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. జైలులోని ఒకే సెల్ బ్లాకులో ఉన్న వీరందరూ ఓ పథకం ప్రకారం సినీ ఫక్కిలో పారిపోయారు. సెల్‌లోని ఓ ఖైదీకి అకస్మాత్తుగా తీవ్రమైన మూర్ఛ వ్యాధి వచ్చిందని, అతను స్పృహ తప్పి పడిపోయాడని ఖైదీలంతా పెద్ద పెట్టున అరుస్తూ నాటకం ఆడారు. ఖైదీని కాపాడేందుకు జైలు సిబ్బంది సెల్ తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. ఆ సమయంలోనే లోపల ఉన్న ఖైదీలంతా సిబ్బందిపై దాడి చేసి, తాళాలు లాక్కుని పారిపోయారు. పరారైన 17 మంది ఖైదీల్లో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ సహా తొమ్మిది మంది సిబ్బందిని జైళ్ల శాఖ డిజిపి సస్పెండ్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన ఖైదీల కోసం 17 ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఖైదీల దాడిలో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. తంగపండి అనే పోలీసు తలకు తీవ్ర గాయమైంది. ఖైదీల పరారీ ఘటన నేపథ్యంలో పొరుగున ఉన్న మదురై, దిండిగల్ జిల్లాలతో పాటు కేరళలోని ఇడుక్కి జిల్లాలోనూ హై అలర్ట్ ప్రకటించారు.
Print Editionజైలు నుంచి ‘నాటకీ’యంగా ఖైదీల పరార్
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 11:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)