శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్‌లో స్వల్ప భూకంపం

1 గంట క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మాండు : నేపాల్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. ఖాట్మాండుకు వాయవ్య దిశగా సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాలి ప్రావిన్స్‌లోని హుమ్లా జిల్లాలో శుక్రవారం ఉదయం 7.10 గంటలకు భూమి కంపించిందని జాతీయ భూకంప పర్యవేక్ష‍ణ, పరిశోధన సంస్థ తెలిపింది. రిక్టర్‌స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైందని పేర్కొంది. పొరుగున ఉన్న ముగు, భజహంగ్‌ జిల్లాల్లోనూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్